ఫ్లడ్‌.. బ్లడ్‌.. పీక్స్‌కు చేరిన కాళేశ్వరం వార్‌!

Published on Mon, 07/13/2026 - 12:22

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ రక్తదాన శిబిరం నిర్వహించగా.. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్‌ ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇటు తెలంగాణ భవన్‌, అటు గాంధీభవన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించాల్సి వచ్చింది.

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పీవీ నరసింహారావు మెమోరియల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో బీఆర్‌ఎస్వీ.. ‘రేవంత్‌ రక్తదాహానికి రక్తదానం’ అనే నినాదంతో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు.. ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాళేశ్వరం అంశాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సేకరించిన రక్తపు ప్యాకెట్లతో.. సీఎం రేవంత్‌ నివాసానికి వెళ్లి నిరసన తెలుపుతామని బీఆర్‌ఎస్వీ నేతలు అంటున్నారు. దీంతో తెలంగాణ భవన్‌ బయట భారీగా పోలీసులు మోహరించారు. ఇక..

మరోవైపు అధికార కాంగ్రెస్‌ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. గాంధీభవన్‌లో ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాన్ని ప్రదర్శించింది. ప్రాజెక్టు లోపాలు అంటూ పలు చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కాళేశ్వరం అంశాన్ని ఇరు పార్టీలు రాజకీయ ఆయుధంగా మార్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా.. మరోవైపు రాజకీయ కక్షతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎదురుదాడి చేస్తోంది. దీంతో కాళేశ్వరం వ్యవహారం చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమవుతోంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)