Breaking News

వారమైనా ఆచూకీ లేదు.. రమణారెడ్డి ఎక్కడ?

Published on Tue, 11/12/2024 - 13:28

సాక్షి, విశాఖపట్నం: వారం రో​జుల క్రితం సోషల్‌ మీడియా కార్యకర్త రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ వచ్చి రమణారెడ్డిని ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకెళ్లారని..  రోజుకోక పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమణారెడ్డి వివరాలు అడిగినా పోలీసులు చెప్పడం లేదంటున్నారు. అర్ధరాత్రి వేళ తీసుకెళ్తూ.. ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు డీలీట్‌ చేశారు.

ఇంటికి వచ్చిన వెంటనే రమణారెడ్డి నుంచి మొబైల్‌ను పోలీసులు తీసేసుకున్నారు. బెయిల్‌ ఇస్తామంటూ ప్రకాశం జిల్లాలోని స్టేషన్లను పోలీసులు తిప్పుతున్నారు. మామ ఆచూకీ కోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ రమణారెడ్డి అల్లుళ్లు తిరుగుతున్నారు. రమణారెడ్డి ఆచూకీ తెలియక తల్లి,భార్య, కుమార్తెలు తల్లడిల్లిపోతున్నారు. రమణారెడ్డి ఫోన్‌ను పోలీసులు తీసేసుకున్నా ఆయన ఫోన్‌ నుంచి ఎక్స్‌లో పోస్టులు పెట్టినట్లుగా కనిపిస్తున్నాయని ఆయనకు కుమార్తె తెలిపింది. రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆయన కుటుంబసభ్యులు అంటున్నారు.

నా భర్త ఎక్కడ? కన్నీళ్లు పెట్టుకున్నరమణారెడ్డి కుటుంబం

 

కాగా, కూటమి సర్కార్‌ తప్పిదాలను ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అక్రమ కేసులు బనాయిస్తోంది. నిన్నటివరకు సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారని నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశ్నించడంతో సరికొత్త పన్నాగం పన్నింది. ప్రభుత్వ పరంగా నేరుగా కేసులు పెట్టకుండా పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించింది. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోనే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (24 గంటల్లో) 29 కేసులు నమోదు చేయించారు.




 


 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)