Breaking News

పొలిటికల్‌ ట్విస్ట్‌లు.. బీఆర్‌ఎస్‌లోకి పీజేఆర్‌ తనయుడు!

Published on Mon, 10/30/2023 - 10:31

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నుంచి జూబ్లీహిల్స్‌ టికెట్‌ ఆశించి.. రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. అలాగే, నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, దరువు ఎల్లన్న సైతం బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. 

కాగా, పీజేఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌ రెడ్డి అధికార బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. కాసేపట్లో మంత్రి హరీష్‌రావు.. దోమలగూడలోని విష్ణువర్ధన్‌ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌లోకి విష్ణువ‍ర్ధన్‌ రెడ్డిని ఆహ్వానించనున్నారు. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్‌లో చేరికపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. దీంతో, ఆయన బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. 

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌ టికెట్‌ ఆశించిన ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించలేదు. అజారుద్దీన్‌కు టికెట్‌ ఖాయం చేసింది. దీంతో విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. తన అనుచరులతో సమావేశమైన విష్ణువర్ధన్‌ రెడ్డి.. వారి సూచనల మేరకు బీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: పక్క పార్టీ నేతల కోసం తెలంగాణ బీజేపీ ఎదురుచూపులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)