Breaking News

‘చంద్రబాబు వంద రోజుల పాలన మోసం.. దగా’

Published on Fri, 09/20/2024 - 10:22

 

సాక్షి, అనంతపురం: చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువు పరిస్థితి ఉందని.. రైతులకు కనీసం పెట్టుబడి సహాయం కూడా అందలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వంద రోజుల పాలన మోసం, దగా.. మాయమాటలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు గోబెల్స్‌ను మించిపోయారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే నవరత్నాలు అమలు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉంది. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే నాటికి 7 వేల కోట్ల రూపాయలు ఉంది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు’’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు.

ఇదీ చదవండి: ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి!

‘‘జగన్ సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి వచ్చేది.. రైతు భరోసా పథకం అందేది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఏ మోహం పెట్టుకుని టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్తారు’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి దుయ్యబట్టారు.

తిరుపతి లడ్డూ: చంద్రబాబు ఒక మాట.. ఈవో మరో మాట
‘‘కోట్ల మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. తిరుపతి లడ్డూల విషయం చంద్రబాబు ఒక మాట... ఈవో శ్యామలరావు మరో మాట మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యాలయం లో తిరుపతి లడ్డూల ప్రస్తావన ఎందుకు చంద్రబాబు?. లడ్డూలపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడమే చంద్రబాబు దిన చర్య’’ అంటూ అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)