Breaking News

ఆర్యవైశ్యుల పట్ల చంద్రబాబుది కపట ప్రేమ: వెల్లంపల్లి

Published on Sun, 07/02/2023 - 15:57

సాక్షి, విజయవాడ: ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబుకు ఆర్యవైశ్యులు గుర్తుకొస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్యవైశ్యులకు చంద్రబాబు ఏం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుది వైశ్యుల పట్ల కపట ప్రేమ అని, కొంతమంది ఆర్యవైశ్యులు టీడీపీలో చేరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘‘టీజీ వెంకటేష్, అంబికా కృష్ణ, కవిత వంటి వారు ఎందుకు టీడీపీ నుంచి బయటికి వచ్చారు. కావాలనే కొందరు ఆర్యవైశ్య మహాసభ పై బురద జల్లాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు అన్ని రకాలుగా గుర్తింపు వచ్చింది. ఆర్య వైశ్యులకు సంబంధించి దేవాదాయశాఖలో ఉన్న ఆస్తులను ఆర్యవైశ్యుల ట్రస్ట్‌కు ఇచ్చారు. ఆర్యవైశ్యుల మనోభావాల మేరకు చింతామణి నాటకాన్ని రద్దు చేశారు. ఎవరెన్ని చేసినా ఆర్యవైశ్య మహాసభ చెక్కు చెదరదు. చిన్న చిన్న మనస్పర్ధలను సరిచేసుకుని అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజనతో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారు:  డిప్యూటీ స్పీకర్‌
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని, ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు.  ఆంధ్రరాష్ట్రంలో ఆర్యవైశ్య మహాసభకు కొత్త భవనాన్ని నిర్మిస్తున్నాం. కొన్ని అవాంతరాలు వచ్చినా మహాసభను పటిష్టం చేసి భవన నిర్మాణం పూర్తి చేస్తాం. కొంతమంది మహాసభలో పదవుల కోసం టీడీపీలో చేరి సమ్మేళనాలు పెడుతున్నారు. సమ్మేళనం పెట్టినా తప్పులేదు కానీ ఆర్యవైశ్యులకు ఏం చేస్తారో చెప్పాలి. మహాసభను అగౌరవపరిస్తే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు అగౌరవపడినట్టే’’ అని కోలగట్ల పేర్కొన్నారు.
చదవండి: లోకేశ్‌కు మంత్రి కాకాణి సెటైరికల్‌ పంచ్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)