Breaking News

తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?: వెల్లంపల్లి

Published on Fri, 01/26/2024 - 14:44

సాక్షి, విజయవాడ: చంద్రబాబు తోకలు ఎవరూ గెలవరంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. శుక్రవారం ఆయన సెంట్రల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అందరి జీవితాలు బాగుండాలంటే సీఎం జగన్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు ప్రజల వద్ద బోండా ఉమా లేడని.. బైక్ రేసులు, భూ కబ్జాలు, దొంగతనాలు, గుండాయిజం, కాల్ మనీలు చేసింది టీడీపీ నేతలేనని దుయ్యబట్టారు.

‘‘తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది. బోండా ఉమా ఆఫీసు ఉన్న ప్రాంతంలోనే ఉమాకి మెజార్టీ రాదు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలవడం కలే. బోండా ఉమాకు సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడే అర్హత లేదని వెల్లంపల్లి మండిపడ్డారు.

షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఇలా మాట్లాడటం దారుణం. ఆమె అంటే మాకు గౌరవం. గతంలో వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్లు ఇప్పుడు షర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓటు, సీటు లేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దివంగత సీఎం వైఎస్సార్ పేరును కాంగ్రెస్‌.. ఎఫ్ఐఆర్‌లో  నమోదు చేయించడం దారుణం. సోనియా గాంధీకి తెలియకుండానే వైస్సార్ మీద కేసు పెట్టారా?. 16 నెలలు సీఎం జగన్‌ను జైల్లో పెట్టింది వాస్తవం కాదా?. అలాంటి పార్టీలో షర్మిలమ్మ ఎలా  చేరారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: సీఎం జ‌గ‌న్, చంద్రబాబు మ‌ధ్య‌ తేడా ఇదే 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)