Breaking News

లోకేష్‌ దందాలు కప్పిపుచ్చేందుకే.. చంద్రబాబుపై ఆర్కే రోజా ఫైర్‌

Published on Thu, 10/10/2024 - 18:58

సాక్షి, అమరావతి: చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ‘‘ఆత్మస్తుతి పరనింద ముఖ్యమంత్రి  చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఈ విషయంలో మనా తనా అనే భేదం కూడా ఉండదు. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించిన మొదటి కలెక్టర్లు ఎస్పీలు, ఉన్నతాధికారుల సమావేశంలో మాది పొలిటికల్ గవర్నెన్స్ మా వారు చెప్పిందే చేయండి అని చెప్పి విచ్చలవిడిగా దందాలకు, అరాచకాలకు ఆజ్యం పోశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి ఆ తప్పులు ఎమ్మెల్యేల మీద నెట్టుతున్నారు.’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు.

తన మీడియాతోనే తమ ఎమ్మెల్యేల మీద బురదజల్లి తప్పంతా వారిదే అన్నట్లు ప్రచారం చేయిస్తున్నారు. ఈ మాటున తన తప్పులు, వైఫల్యాలు, కుమారుడు లోకేష్‌ దందాలను చర్చకు రానివ్వడం లేదు. ఎమ్మెల్యేల అవినీతిపై ఉదయం కథనాలు, చర్చ చేస్తున్న సదరు మీడియానే సాయంత్రం ముఖ్యమంత్రి వీరుడు, శూరుడు అంటూ ఎంపిక చేసుకున్న వందిమాగాదులతో చిలకపలుకల మాటలతో రక్తికట్టిస్తున్నారు.’’ అంటూ ఆర్కే రోజా ఎండగట్టారు.

‘‘అధికారంలోకి రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం. అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఫల్యాలను, తన కుమారుడి దందాలను కప్పిపుచ్చుకోవడానికి తమ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా తన మీడియాతోనే ప్రచారం మొదలెట్టిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఏ కలెక్టర్ల, ఎస్పీల సమావేశంలో తమ టీడీపీ పార్టీ వారు చెప్పిందే చేయాలని చెప్పినట్లు, తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమేనని వైఎస్‌ జగన్‌లాగా చెప్పాలి’’ అని ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)