Breaking News

‘ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగమే’

Published on Fri, 01/24/2025 - 14:45

సాక్షి, నగరి: పక్క రాష్ట్రాల్లో​ వేల కోట్ల పెట్టుబడులు (Investments) వచ్చాయని.. చంద్రబాబు(Chandrababu) ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్‌బుక్‌ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్‌ టూర్‌ అట్టర్‌ ఫ్లాప్‌. పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే.. చంద్రబాబు అండ్‌ కో కట్టుకథలతో ఏపీకి వస్తోంది’’ అని రోజా దుయ్యబట్టారు.

‘‘వైఎస్ జగన్‌ పాలనలో లా అండ్‌ ఆర్డర్‌ ఎంతో చక్కగా మెయింటెయిన్‌  చేశారు. మూడు పోర్టుల పనులు పరుగులు పెట్టించారు. చంద్రబాబు, లోకేష్‌ తీరుతో దావోస్‌లో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. స్పెషల్‌ ఫ్లైట్లు, సూట్లు, బూట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెద్ద వేదికపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు, కట్టుకథలు, పచ్చమీడియాతో ప్రజలను మభ్యపెట్టారు. దావోస్‌లోనూ అదే తరహా మభ్య పెట్టాలని చూశారు. కానీ, చంద్రబాబు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారు’’ అని రోజా చెప్పారు.

‘‘వైఎస్‌ జగన్‌ను చూసి అదానీ, అంబానీ, జిందాల్‌ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారు. చంద్రబాబును, ఆయన పరిపాలన చూసి ఒక్క పారిశ్రామికవేత్త అయినా వచ్చారా?. మీ అరాచక రెడ్‌బుక్‌ పాలన చూసి పెట్టుబడుదారులు భయపడుతున్నారు. ఏపీ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్ర పరువు కాపాడాలని ఆ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా. పవన్‌ను చంద్రబాబు ఎందుకు దావోస్‌ తీసుకెళ్లలేదు?. పవన్‌ వస్తే లోకేష్‌ స్థాయి తగ్గిపోతుందని తీసుకెళ్లలేదా?.’’ అంటూ రోజా ప్రశ్నలు గుప్పించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం

ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు.. హోదాకు తగ్గినట్టు మాట్లాడితే బాగుండేది!

 

 

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)