Breaking News

ఆ వాస్తవాన్ని చంద్రబాబు సర్కార్‌ దాస్తోంది: మేరుగు

Published on Sat, 07/12/2025 - 15:54

సాక్షి, తాడేప‌ల్లి: రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యం చావుల‌కు చంద్ర‌బాబే కార‌ణమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిస్టిల‌రీల నిర్వాహ‌కులంతా టీడీపీ వారేనని.. మ‌ద్యం త‌యారీకి య‌థేచ్ఛ‌గా స్పిరిట్‌ను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌ల్తీ మ‌ద్యాన్ని బ్రాండెడ్ మ‌ద్యంగా విక్ర‌యించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.

‘‘ప్ర‌తి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ క‌ల్తీ మ‌ద్యమే. టీడీపీ నాయ‌కుల ధ‌న దాహానికి అమాయకుల ప్రాణాలు బ‌లవుతున్నాయి. ఈ కల్తీ మద్యం దందా వెనుక టీడీపీలోని కీలక నేతలే ఉన్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్‌ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్‌ మద్యం పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

..కల్తీ మద్యం తాగి ఇటీవ‌ల అనేక మంది హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్‌ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు’’ అని మేరుగ నాగార్జున ఆరోపించారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)