Breaking News

పురంధేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నట్టా? లేక టీడీపీలోనా: కొడాలి నాని

Published on Sat, 11/04/2023 - 15:44

సాక్షి, తాడేపల్లి: ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. పురంధేశ్వరి బీజేపీలో ఉందా? లేక టీడీపీలో ఉందా? అని ప్రశ్నించారు. పురంధేశ్వరి లేఖలకు భయపడేవారు, బెదిరిపోయే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, మాజీ మంత్రి కొడాలి నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు పురంధేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల మీడియాలో హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు వదినను ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నట్టు కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతిస్తోందని బాబు చెప్పడంతో టీడీపీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బయటకు వచ్చారు.

కాంగ్రెస్‌తో ఉన్నది చంద్రబాబే..
చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి బీజేపీలో చేరారు. ఆమెకు రాజకీయ విలువలు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వెనుక, కాంగ్రెస్‌తోనూ ఉన్నది చంద్రబాబేనని అంత స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం, బీఆర్ఎస్‌తో పోరాడుతున్నాం అంటున్న బీజేపీకి కాకుండా.. టీడీపీకి పురంధేశ్వరి మద్దతు ఇస్తోంది. టీడీపీ అంటే కాంగ్రెసే కదా?. మరి, పురంధేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నట్టా? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలి. ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది. 

వీరి రాజకీయం ఎవరి కోసం..
కాంగ్రెస్‌లో ఉండి కేంద్రమంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చింది. ఆ తర్వాత బీజేపీలో చేరినా, బాబు ఆదేశాల మేరకు, బాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న రేణుకా చౌదరి, బీజేపీలో ఉన్న పురంధేశ్వరి.. చంద్రబాబు ప్రయోజనాలు, ఎల్లో బ్యాచ్‌ ప్రయోజనాలు కాపాడటంలో ముందుకు సాగుతున్నారు. వీరి రాజకీయం ఎవరి కోసం?’ అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు కొత్త టెన్షన్‌.. సన్నిహితులపై ఆక్రోశం!

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?