Breaking News

పీకేతో భేటీ.. చంద్రబాబు ఏం చేస్తాడంటూ కొడాలి నాని సెటైర్లు

Published on Sun, 12/24/2023 - 14:31

సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా? అని ప్రశ్నించారు. అలాగే, గతంలో ప్రశాంత్‌ కిషోర్‌ను దారుణంగా తిట్టిన విషయాలు ఎల్లో బ్యాచ్‌ మరిచిపోయిందా? అని విమర్శలు చేశారు. 

కాగా, కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఎంత మంది పీకేలను తెచ్చి పెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఏమీ చేయలేరు. ఐప్యాక్‌తో ప్రశాంత్‌ కిషోర్‌కు సంబంధం లేదు. ప్రశాంత్‌ కిషోర్‌ మేము ఇప్పటికే పూర్తిగా వాడేశాం. పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మేము పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్‌ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడు అని చంద్రబాబు ఆరోపించారు. మరి ఇప్పుడు ఎల్లో బ్యాచ్‌ చేస్తున్నదేంటి?. ఆనాడు మనకంటే గొప్పోళ్లు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా తమ్ముళ్లూ అన్నాడు కదా. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు.. ప్రశాంత్‌ కిషోర్‌ గురించి ఏం అన్నారో అందరికీ తెలుసు. 

చంద్రబాబును ప్రశాంత్‌ కిషోర్‌ కలిస్తే ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది. ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే చంద్రబాబును పీకే కలిశారు. చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ వచ్చి చేసేదేమీ లేదు. బాబాయ్‌ను చంపడానికి పీకేనే ప్లాన్‌ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికే కోడికత్తితో పొడిపించుకున్నారని అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటాడా?. ఏం చేస్తారో వాళ్లకే తెలియాలి. 

పీకేకు ఐప్యాక్‌తో సంబంధమే లేదు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు అయిపోయాక వ్యూహకర్తగా తప్పుకుని ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. చంద్రబాబు ఒకవైపు పవన్‌ కల్యాణ్‌ను పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. మరోవైపు ఇంకో పీకేను పెట్టి కాంగ్రెస్‌తో చర్చలకు తెరలేపాడు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం. కేంద్రంలో బీజేపీ వస్తుందా? లేక కాంగ్రెస్‌ వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నాడు’ అంటూ విమర్శించారు.  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)