Breaking News

టీడీపీ విష సంస్కృతి.. ఇదేం దౌర్జన్యం: బొత్స

Published on Sun, 06/30/2024 - 15:34

సాక్షి, విజయనగరం: ఎన్నికల తర్వాత దాడులు పెరిగాయని.. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఉండకూడదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు.

ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు హక్కులున్నాయి. విజయనగరంలో మా పార్టీ ఆఫీసులోకి టీడీపీ నాయకులు చోరబడ్డారు. ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. చట్టబద్ధంగా మా పార్టీ ఆఫీసులు నిర్మాణాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీల వీసీలపై కూడా దౌర్జన్యానికి దిగుతున్నారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

‘విజయనగరం జిల్లా లో విష సంస్కృతి వచ్చింది. ప్రతిపక్ష వైస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే పరిశీలించడం ఏమిటి?. ఏదయిన పొరపాట్లు జరిగితే నోటీస్ ఇవ్వవచ్చు.  ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించవచ్చు. యూనివర్సిటీల్లో వీసీలను నామినేట్ చేయడం ఒక విధానం. ఆ వీసీ కార్యాచరణ నచ్చకపోతే నోటీస్ ఇవ్వవచ్చు. ⁠వీసీ ఆఫీస్‌లకు వెళ్లి బెదిరించడం, తొలగించడం తప్పు.  అవినీతి పై ఎంక్వయిరీ కోరడం తప్పు కాదు. అధికారం వాళ్ల చేతుల్లో వుంది. విద్యాశాఖ లో నాపై వచ్చిన ఆరోపణలు పై నో కామెంట్. ఫైల్స్ వాళ్ళ దగ్గర వున్నాయి. పరిశీలించుకోవాలి. కొందరు రిటైర్ అయిన అధికార్లు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడరు. అధికారం పోయాక వచ్చి చెప్తారు. అది ఎంత వరకు సమంజసం.’’ అంటూ బొత్స మండిపడ్డారు

‘‘⁠అనుభవం ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్లకు తెలుసు. పథకాలు ఇస్తారో ఇవ్వరో వాళ్లకే తెలియాలి. ⁠రేపు ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్‌తో కలుపుకొని 6 వేలు టీచర్ ఖాళీలు ఉన్నాయని అంచనా. ⁠ఈ ప్రభుత్వం 50వేలు అంచనా వేసి 16వేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ⁠కేంద్రం పార్లమెంట్ లో 30వేలు పోస్ట్‌లు ఖాళీ ఉన్నాయని అన్నారు. 117జీవోని రద్దు చేస్తే ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని బట్టి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వవచ్చు’’ అని బొత్స పేర్కొన్నారు.

 

 


 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?