Breaking News

రేవంత్‌.. నోరు అదుపులో పెట్టుకో

Published on Thu, 04/10/2025 - 18:44

హైదరాబాద్‌,సాక్షి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు.

గుజరాత్‌లో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన అఖిల భారత కాంగ్రెస​ కమిటీ సదస్సు ‘న్యాయ్‌పథ్‌’లో.. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకమైన వారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, గాంధీ ఆలోచనలను రాహుల్‌ గాంధీ ముందుకు తీసుకెళుతుంటే ప్రధాని మోదీ గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.    

సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడారు. రేవంత్ మతి స్థిమితం లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. రాహుల్ మెప్పు కోసం మాట్లాడారు. రేవంత్ తెలంగాణను రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టారు. రాజ్యాంగేతర శక్తి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియేట్‌లో అడుగు పెట్టారు. సీఎం లేనప్పుడు అజ్ఞాత వ్యక్తి సెక్రటరియేట్‌లో రివ్యూ చరిత్రలో లేదు.

రేవంత్ నీ స్థాయిని మించి మోదీపై మాట్లాడటం మానుకో. ప్రధాని పదవి కోసం నెహ్రూ దేశాన్ని ముక్కలు చేశారు. దేశ విభజనకు కారణం కాంగ్రెస్. రేవంత్ చరిత్ర మర్చిపోయిన దేశ ప్రజలు మర్చిపోలేదు. హామీలు అమలు చేయకుండా అహ్మదాబాద్‌లో గొప్పలు చెప్తావా?గ్యారంటీలపై చర్చకు సిద్దమా? రాహుల్ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.  

హామీలు అమలు చేయనందుకు ఆయన్ను రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వరు. దమ్ముంటే హెచ్‌సీయూలో రాహుల్ గాంధీ మీటింగ్ పెడతారా? త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ రాబోతుంది. రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చననే నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?’ అని ప్రశ్నించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)