Breaking News

మహారాష్ట్ర డీజీపీపై ఈసీ బదిలీ వేటు

Published on Mon, 11/04/2024 - 15:52

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికళ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం బదిలీ వేటు వేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఈసీ తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విషయంలో డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌ సహా  ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.

రష్మీ శుక్లా స్థానంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. డీజీపీగా నియామకం కోసం మంగళవారం మధ్యాహ్నంలోగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్‌ను పంపాలని తెలిపింది. దీంతో రష్మీ శుక్లా స్థానంలో అత్యంత సీనియర్‌ అధికారిగా ఉన్న వివేక్‌ ఫన్సాల్కర్‌కు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఆయన ముంబై సీపీగా పనిచేస్తున్నారు.

కా గాగత నెలలో రాష్ట్ర డీజీపీని తొలగించాలని అభ్యర్థిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే  లేఖ రాశారు. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ(శరద్‌చంద్ర) సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై డీజేపీ శుక్లా  పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని  ఆయన లేఖలో ఆరోపించారు. 

చదవండి: దేశంలో పలు స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పు

గత ప్రభుత్వ హయాంలో నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారని.. నేతలు ఏం చేయబోతున్నారనేది తెలుసుకొని ఆ సమాచారాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేరవేశారంటూ శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై రాజకీయ హింస పెరిగిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. ఆమెను తొలగించాలని లేఖలో కోరాయి. 

దీనిపై ఈసీ స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సూచించారు. తమ విధులను నిర్వహించడంలో పార్టీలకతీతంగా భావించేలా చూడాలన్నారు. ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఓటింగ్‌ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి. 

	మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా పై ఈసీ వేటు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)