‘వైద్య రంగంలో జగన్‌ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’

Published on Tue, 10/14/2025 - 12:03

సాక్షి, శ్రీకాకుళం: మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించి  చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకేసారి వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలు తెచ్చారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ధర్మాన పేర్కొన్నారు.

పేద, మద్యం తరగతి కుటుంబాల్లో ఒకరికి ఆరోగ్యం పాడైనా అప్పుల పాలవుతున్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు పేద, మధ్య తరగతి వారి కోసమే. వైద్య విద్యను అధిక ఖరీదు చేస్తే పేదలు ఎలా చదువుకోగలరు?. కోట్లు పెట్టి మెడికల్‌ సీట్లు కొన్నవారు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా?. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే చంద్రబాబు మార్చుకోవాలి’’ అని ధర్మాన​ ప్రసాదరావు డిమాండ్‌ చేశారు.

‘‘నాణ్యమైన విద్య ఒక్కటే సమసమాజాన్ని స్థాపించగలదు. సమ సమాజాన్ని స్థాపనే లక్ష్యంగా వైఎస్సార్‌సీ హయాంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. రాజ్యాంగం ఏం చెప్పేది కూడా కూటమి పాలకులకు తెలియదా?. విద్య, వైద్యం ప్రైవేటీకరణ ప్రజలకు అంగీకారం కాదు. వైద్య రంగంలో వైఎస్‌ జగన్‌  చేసిన సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే. పలాస కిడ్నీ ఆసుపత్రి, ిసెర్చ్‌ సెంటర్‌ వైఎస్‌ జగన్‌ పాలనకు గొప్ప నిదర్శనం’’ అని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

Dharmana: వైద్య రంగంలో వైఎస్ జగన్ చేసిన సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే

 

 

 

 

 

 

 

 

 

 

 

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)