ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
అల్లకల్లోలం సృష్టించేందుకు టీడీపీ కుట్ర: మంత్రి నారాయణస్వామి
Published on Sat, 08/26/2023 - 19:48
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, పుంగనూరు ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయి అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్, అయ్యన్నపాత్రుడు క్యారెక్టర్ లేనివాళ్లు. మంత్రి పెద్దిరెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు దారుడు గుర్తుకు వస్తాడు. పవన్ కల్యాణ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి దుయ్యబట్టారు.
‘‘ప్రజలకు మంచి చేస్తాం అని టీడీపీ నేతలు చెప్పడం లేదు.. పిచ్చి కుక్కలు మాదిరిగా రోడ్లపై తిరుగుతున్నారు. రౌడీ రాజ్యం తేవాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏ ఊరికి వెళ్లిన సీఎం జగన్ సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయి. మంత్రి పెద్దిరెడ్డి చాలా సహనంతో ఉన్నారు. మొన్న పుంగనూరులో జరిగిన ఘటనపై కోర్టులు సుమోటోగా స్వీకరించాలి’’ అని మంత్రి నారాయణ స్వామి కోరారు.
చదవండి: ‘చంద్రబాబూ.. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?’
Tags : 1