Breaking News

పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ కీలక నేతలకు సమన్లు

Published on Wed, 06/14/2023 - 18:52

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ కీలక నేతలకు మరో షాక్‌ తలిగింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో బుధవారం కాంగ్రెస్‌ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు సైతం సమన్లు జారీ అయిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఓ పేపర్‌ ప్రకటనే ఇందుకు కారణమైంది. మే 5వ తేదీన పబ్లిష్‌ అయిన పత్రికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓ యాడ్‌ ఇచ్చింది. బీజేపీని 40 శాతం అవినీతి పార్టీగా ఎద్దేవా చేస్తూ.. అందులో గత నాలుగేళ్లలో బీజేపీ  లక్షన్నర కోట్ల డబ్బు దోచుకుందని ఆరోపించింది. ఈ ప్రకటన ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవప్రసాద్‌ మే 9వ తేదీన ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌.. రాహుల్‌ గాంధీతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు సైతం సమన్లు జారీ చేసింది. 

ఇదిలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీ చేసిన మోదీ వ్యాఖ్యలు.. పరువు నష్టం దావాకి దారి తీయగా, ఈ ఏడాది మొదట్లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్‌ కోర్టు. ఆ శిక్ష కారణంగానే ఆయన తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది కూడా.

ఇదీ చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీం!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)