Breaking News

మరో వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ కూల్చివేతకు టీడీపీ కుట్ర.. బయటపడ్డ సంచలన ఆడియో

Published on Sun, 06/23/2024 - 20:40

సాక్షి, విజయవాడ: టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేతకు కుట్రకు తెరతీశారు. సంచలన ఆడియో బయటపడింది. పాత తేదీలతో నోటీసులు ఇవ్వటానికి వస్తున్నట్టు కార్పొరేషన్‌ సిబ్బంది చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. తాజాగా విజయవాడ ఆఫీస్‌నీ కూల్చివేసేందుకు కుట్రలు చేస్తోంది. ఈ మేరకు కార్పొరేషన్‌ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పాత తేదీ వేసి నోటీసులు జారీచేస్తామని, తీసుకోవాలంటూ పార్టీ ఆఫీసు నిర్మాణ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు.

కాగా, తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్‌డోజర్లతో కూల్చి వేసింది.

దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్‌ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్‌ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)