Breaking News

ఖర్గే హెలికాప్టర్‌లో తనిఖీలు.. ‘బీజేపీ నేతలను తనిఖీ చేస్తున్నారా?’

Published on Sun, 05/12/2024 - 13:41

ఢిల్లీ: లోక్‌సభ  ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలను ఎన్నికల అధికారులు టార్గట్‌ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే హెలికాప్టర్‌ను బిహార్‌లోని సమస్తిపూర్‌లో పోలింగ్‌ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా  విదిలేస్తున్నారని కాంగ్రెస్‌ ఎన్నికల అధికారులపై విమర్శలు చేసింది. శనివారం మల్లికార్జున ఖర్గే.. సమస్తీపూర్‌, ముజఫర్‌పర్‌లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

‘‘ఇప్పటికే కేరళలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌ను ఎ‍న్నికల అధికారలు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జన ఖర్గేను బిహార్‌లోని సమస్తీపూర్‌లో అధికారుల చేత తనిఖీ చేయబడ్డారు’’ అని ‘ఎక్స్‌’ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ నేత రాజేష్‌ రాథోడ్‌ అన్నారు. బిహార్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్‌ చెక్‌ చేశారని రాజేష్‌ రాథోడ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.  వీడియోలో.. హెలికాప్టర్‌  చుట్టూ అధికారులు, పోలిసులు ఉండటం గమనించవచ్చు.

 

‘‘కేవలం కాంగ్రెస్‌ నేతల హెలికాప్టర్లకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? లేదా బీజేపీకి చెందిన అగ్రనాయకుల హెలికాప్టర్లును కూడా చెక్‌ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి.  ఈ తనిఖీలు సమాచారాన్ని ఈసీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే ప్రతిపక్షాలను అడ్డుకొని, ఎన్డీయే నేతలను ఫ్రీగా వదిలేసినట్లు అర్థమవుతుంది’’ అని రమేష్‌ రాథోడ్‌ అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు నేతల హెలికాప్టర్లను చెక్‌ చేసిన అన్ని వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)