Breaking News

‘ఇక బీజేపీలో చేరికా?’.. కుండబద్ధలు కొట్టేసిన శశిథరూర్‌

Published on Tue, 06/24/2025 - 11:58

న్యూఢిల్లీ: పీయూష్ గోయల్‌తో సెల్ఫీ దిగడం, ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ను ఆకాశానికి ఎత్తడం, భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగడడం, అదే తరుణంలో కాంగ్రెస్‌తో విభేదాలున్నాయని అంగీకరించడం.. ఇవన్నీ వేటికి సంకేతాలుగా భావించొచ్చు!. ఇదే విషయాన్ని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ వద్ద ప్రస్తావించగా.. ఆయన చిరునవ్వుతో అదేం లేదంటున్నారు.  

తాజాగా .. సోమవారం(జూన్‌ 23న) The Hindu పత్రికలో శశిథరూర్‌ రాసిన ఓ వ్యాసం పబ్లిష్‌ అయ్యింది. ఆపరేషన్ సిందూర్‌.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విదేశాంగ ప్రచారం భారతదేశ ఐక్యతను, సంకల్పాన్ని సూచించిందని ఆ కథనంలో థరూర్‌ రాశారు. ఈ వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా షేర్ చేయగా.. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ ‘‘శశిథరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని లోపాలను.. ఆ పార్టీలోని విభేదాలను బహిర్గతం చేశాయి’’ అని అన్నారు. 

ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ బీజేపీలో చేరికకు సంకేతాలుగా భావించొచ్చా? అని  మంగళవారం ఎదురైన ప్రశ్నకు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ఇవేవీ నేను బీజేపీలో చేరతానన్న సంకేతం కాదని స్పష్టత ఇచ్చారాయన. ‘‘విదేశాంగ మిషన్‌ విజయాన్ని మాత్రమే నేను ఆ వ్యాసంలో ప్రస్తావించా. ఇది అన్ని పార్టీల ఐక్యతను ప్రతిబింబించే విషయం మాత్రమే’’ అని అన్నారాయన. 

"ప్రధాని మోదీ చొరవతో.. ఇతర దేశాలతో భారత్‌ సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే ఇది బీజేపీనో, కాంగ్రెస్‌ తీసుకొచ్చిన విదేశాంగ విధానం కాదు. ఇది భారతదేశ విదేశాంగ విధానం. సుమారు 11 ఏళ్ల కిందట పార్లమెంట్‌లో విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను. అంత మాత్రాన నేను ప్రధాని మోదీ పార్టీలో చేరతానని కాదు. ఇది జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రకటన మాత్రమే’’ అని కుండబద్ధలు కొట్టారాయన. 

అంతకుముందు.. కాంగ్రెస్‌ అధిష్టానంతో తనకు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే అవి నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే పరిష్కారం అయ్యే విషయాలేనని, వాటి గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానని థరూర్‌ మీడియా ముఖంగా ప్రకటన చేశారు.‘‘ గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నా విజయంలో కీలక పాత్ర పోషించారు. నేను ఇప్పటికీ కాంగ్రెస్‌కు విదేయుడినే. పార్టీకి అవసరమైతే పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతర పార్టీలో చేరే ఆలోచన ఏమాత్రం లేదు’’ అని ఆ సమయంలో అన్నారయన. అలాగే, తాను ప్రజాస్వామ్యవాదిగా, మతతత్వానికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తినంటూ గతంలోనూ ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు.  

ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబడుతోంది. అయితే ఆ పార్టీ సీనియర్‌ సభ్యులు థరూర్‌ మాత్రం అందుకు భిన్నంగా ఆకాశానికి ఎత్తుతున్నారు. అలాగే.. ట్రంప్‌ మధ్యవర్తిత్వం ప్రకటన విషయంలో కాంగ్రెస్‌ లైన్‌కు భిన్నంగా థరూర్‌ వ్యవహరించడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే థరూర్‌ తాజా వ్యాఖ్యలతో ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లయ్యింది.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు