Breaking News

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి

Published on Sat, 03/01/2025 - 12:32

హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో అలజడి రేగింది. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కనపెడుతున్నారని, నిన్న మొన్న చేరుతున్నవాళ్లకు పదవులు ఇవ్వడం ఏమాత్రం సరికాదని  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(Malreddy Rangareddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర జనాభాలో అధికంగా.. 42 శాతం జనాభా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. అలాంటి జిల్లాకు దయచేసి అన్యాయం చేయకండి. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad) జిల్లాలకు కనీసం ఆరుగురు మంత్రులు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు?. ఒకవేళ సామాజిక సమీకరణలు అడ్డు వస్తున్నాయంటే రాజీనామాకు నేను సిద్ధం. జిల్లా అభివృద్ధి కోసం.. మంత్రి ప్రాతినిధ్యం కోసం ఇంకొకరిని గెలిపించేందుకు నేను రెడీ అని కాంగ్రెస్‌ అధిష్టానంను ఉద్దేశించి  మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనైనా గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారాయన. ఇక..

.. పార్టీలోకి ఎవరొచ్చినా గౌరవం ఇవ్వాలి. కానీ పదవులు ఇవ్వొద్దు. ఇప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళని మంత్రులుగా తీసుకోవద్దు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టడం సరైంది కాదు. పని చేసిన వారిని పక్కన పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వస్తున్నాయి. కనీసం పదేండ్లు కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలి. కార్యకర్తల మనోభావాలను.. నేతల సీనియారిటీనీ పరిగణనలోకి తీసుకోవాలి అని ఆయన కోరారు. ఈ క్రమంలో ‘‘పార్టీ లైన్ దాటోద్దు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్న’’ అని మల్‌రెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)