Breaking News

Telangana: నెలాఖరుకు కాంగ్రెస్‌ జాబితా?

Published on Wed, 09/20/2023 - 03:42

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ మరోమారు భేటీ కానుంది. ఢిల్లీ వేదికగా బుధ, గురువారాల్లో ఈ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జర గనుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు లను ఖరారు చేయడంలో భాగంగా దరఖాస్తులను వడపోసి షార్ట్‌ లిస్ట్‌ తయారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి.

స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పీసీసీ నుంచి రేవంత్‌రెడ్డి, భట్టి విక్ర మార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. ఇందులో ఉత్తమ్, రేవంత్‌లు పార్లమెంటు సమావే శాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలోనే ఉండగా, భట్టి మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, మన్సూర్‌ అలీ ఖాన్‌ కూడా స్క్రీనింగ్‌ కమిటీ భేటికి హాజరవుతారు.

ఇటీవలే హైదరాబాద్‌ వేదికగా సమావేశ మైన స్క్రీనింగ్‌ కమిటీ ఏమీ తేల్చకుండానే సమా వేశాన్ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో జరిగే మలిదశ భేటీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన షార్ట్‌లిస్ట్‌ రెడీ కానుంది. అనంతరం ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపుతారని, ఈ కమిటీ భేటీ అనంతరం ఈ నెలాఖరున లేదంటే అక్టోబర్‌ మొదటి వారంలో తొలి జాబితాను విడుదల చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)