Breaking News

వెంక్రటావ్‌ భవిష్యత్త్‌కు మాది భరోసా: కేటీఆర్‌

Published on Thu, 08/17/2023 - 13:46

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. పొంగులేటి కీలక అనుచరుడు తెల్లం వెంకట్రావ్‌ అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోని వెంక్రటావ్‌ను మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు ఆహ్వానించారు. ఇక, వెంకట్రావ్‌ భద్రాచలం టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ను న‍మ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టే. వెంకట్రావ్‌కి ఈ విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వెంక్రటావ్‌ భవిష్యత్త్‌కు మాది భరోసా. జల్‌, జంగల్‌, జమీన్‌ విషయంలో ఏం జరుగుతుందో అందరూ చూడాలి. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతోంది. ప్రాజెక్టుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం పెరిగింది.

..కేసీఆర్‌ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో నీటి కష్టాలు, విద్యుత్‌ వెతలు తీరిపోయాయి. మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎవరెన్ని మొరిగిన మళ్ళీ గెలిచేది మనమే, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. వచ్చే రోజుల్లో భద్రాచలం గుడి అభివృద్ది చేస్తాం.  గోదావరి నది కరకట్ట మరమత్తులు కూడా చేపడతాం’ అని కామెంట్స్‌ చేశారు. 

ఈ క్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడే బయటకు వస్తాయి. ప్రజాసేవ చేసే నాయకత్వం కావాలి. ఎన్నికలప్పుడే కొందరు నేతలు ప్రజల్లోకి వస్తారు అంటూ ఎద్దేవా చేశారు. 

ఇది కూడా చదవండి: స్పీడ్‌ పెంచిన గులాబీ బాస్‌.. తొలి లిస్ట్‌లో అభ్యర్థులు వీరే!

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)