Breaking News

టీడీపీలో అయోమయం

Published on Wed, 01/24/2024 - 05:08

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా తయారైంది. పార్టీ టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోలేక తల బొప్పి కట్టిపోతోంది. జనసేనతో పొత్తుపై పార్టీ నేతలంతా పెదవి విరుస్తుండటంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. తమ టికెట్‌ సంగతి తేలిస్తేనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఎక్కడికక్కడ నేతలు తెగేసి చెబుతుండటంతో తండ్రీ కొడుకులకు నిద్ర కరువైంది.

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే పాతాళా­నికి కుంగిన ఆ పార్టీ.. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా లోతుకు కూరుకుపోతోంది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే పూర్తిగా అయోమయం నెలకొంది. పలు­చోట్ల పార్టీకి ఇన్‌ఛార్జిలు లేకపోవడాన్ని బట్టే ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతోంది. నాయ­కులు ఉన్న చోట కూడా కుమ్ములాటలతో సతమత­మవుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరు­వూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు.

అదే బాటలో మరి­కొందరు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలు­స్తోంది. మరోవైపు జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉంటూ.. బీజేపీతో కూడా పొత్తు ప్రయ­త్నాలు చేస్తు­ండటంతో గందరగోళం ఇంకా పెరిగిపోయింది. తమ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో, ఏ స్థానంలో తాము పోటీలో ఉంటామో తెలియక టీడీపీ క్యాడర్‌ అయోమయంలో మునిగిపోయింది. ఈ పరిస్థితు­ల్లో పలుచోట్ల కీలక నేతలు చంద్రబాబును ధిక్కరి­స్తు­న్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనకుండా ముందు తమ సంగతి తేల్చాలని పట్టుబడు­తున్నా­రు.

గాల్లో గంటా శ్రీనివాసరావు సీటు
సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావును చంద్రబాబు గాల్లో పెట్టడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతు­న్నారు. ఒకసారి గెలిచిన చోట మళ్లీ పోటీ చేయని గంటా వచ్చే ఎన్నికల్లో తనకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు ఇవ్వాలని కోరుతుండగా చంద్ర­బాబు ఎటూ తేల్చడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన తంటాలు పడుతు­న్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం కూడా టీడీపీపై రగిలిపోతోంది.

పార్టీకి అండగా ఉన్న తమను దూరం పెడుతున్నారని వాపోతోంది. అయ్యన్న తనకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు, తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ ఎవరో ఒకరికి మాత్రమే సీటు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో అయ్యన్న అలక వహించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా.. మౌనంగా ఉంటున్నారు.

విశాఖ జిల్లా పెందుర్తి సీటు జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండడంతో అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండారు సత్య­నారాయణమూర్తి అసంతృప్తితో రగిలి పోతు­న్నారు. తన సీటు జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న ఆయన.. అవసరమైతే పార్టీని వీడేందుకు సిద్ధమ­వుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు సీట్లు ఇవ్వకపోతే టీడీపీ సంగతి చూస్తామని గాజువాక, అనకాపల్లి నేతలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్‌లు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేశారు. 

కాకినాడలో టీడీపీకి హెచ్చరికలు
కాకినాడ సిటీ స్థానాన్ని జనసేనకు ఇస్తే తాను మరో దారి చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇప్పటికే బహిరంగంగా తన సీటు జనసేనకు ఇవ్వొద్దని కోరారు. ఒకవేళ ఇస్తే తాను ప్రత్యామ్నాయం చూసు­కుంటానని హెచ్చరించారు. మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ కూడా పార్టీని ధిక్కరిస్తున్నారు.

తూర్పు­గోదావరి జిల్లా కొవ్వూరు సీటు తనకివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతుండగా, చంద్రబాబు మరో వ్యక్తికి ఇవ్వాలని చూస్తున్నారు. తేడా వస్తే ఆయన జంప్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య జనసేన చిచ్చు పెట్టింది. ఇక్కడ అధిక శాతం సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

దేవినేని ఉమకు సీటు లేదు
ఎన్టీఆర్‌ జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా­మహేశ్వరరావుకు సీటు లేదని చెప్పడంతో ఆయన లోలోన కుంగిపోతూ ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మైలవరం సీటును ఆయనకు కాదని కొత్త వ్యక్తికి ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన తనను మోసం చేశారని వాపోతు­న్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దివంగత కోడెల శివప్రసాద్‌ తనయుడు శివ­రామ్‌ ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆయన స్థానంలో బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు ఇస్తుండడంతో ఆయన టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. చిలకలూరిపేట సీటు విషయంలో భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మధ్య పోటీ నెలకొంది.

సీటు లేకపోతే టీడీపీని వదిలేందుకు పుల్లారావు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు సిటీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉండడంతో మొదటి నుంచి అక్కడ పని చేసిన మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం దక్కలేదంటూ ఆయన టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అనంత, కర్నూలు జిల్లాల్లోనూ అదే తీరు
ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రస్తుత ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గ్రూపులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. ఎవరికి సీటిచ్చినా రెండో వర్గం తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు ధర్మవరం ఇన్‌ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్‌ అక్కడి నుంచి పోటీ చేయా­లని చూస్తుండగా, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సీటు తనదేనని చెప్పుకుంటున్నారు. దీంతో పరిటాల ఆగ్రహంతో ఊగి­పోతున్నారు.

తనను నమ్మించి పని చేయి­ంచుకుని ఇప్పుడు మాట మారిస్తే ఊరు­కోనని ఆయన హెచ్చరి­స్తున్నారు. ఒక ఇంట్లో ఒకరికే టికెట్‌ అని చంద్రబాబు చెప్పడంతో రాప్తాడు­లో పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేస్తు­న్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ఇన్‌ఛార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించి మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను నియ­మించడంతో ఆ నియోజకవర్గంలో అసమ్మతి రాజుకుంది. బ్రహ్మానందరెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆలూరు సీటు ఇవ్వకపోతే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ చంద్రబాబుకు ఝలక్‌ ఇవ్వనున్నారు. డోన్‌ అభ్యర్థిగా చంద్రబాబు.. ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించగా, కేఈ ప్రభాకర్‌ తాను రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుపై కేఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడుతున్నారు. అదే జరిగితే ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)