Breaking News

ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్‌

Published on Thu, 03/27/2025 - 00:50

సాక్షి, హైదరాబాద్‌: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్‌ పదవి, విప్‌ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్‌ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని  కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్‌ వాళ్లే రాశారు. రూల్‌బుక్‌ కూడా మారలేదు కదా. 

ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. 
ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్‌ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. 

సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. 
పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్‌ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.   

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)