Breaking News

ఎన్నికలప్పుడే రాజకీయాలు: సీఎం రేవంత్‌

Published on Thu, 12/04/2025 - 17:09

సాక్షి, ఆదిలాబాద్‌: ఎన్నికలు వచ్చినప్పుడే  రాజకీయాలని.. తర్వాత అభివృద్ధే లక్ష్యం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని కేంద్రంలోని నేతలను కూడా ఆహ్వానించానన్నారు. గురువారం.. ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదని.. విపక్ష నేతలను కలుపుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం సభల్లో విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా? అంటూ రేవంత్‌ ప్రశ్నించారు.

‘‘ఎన్నికలయ్యాక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యం. ఏడాదిలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తాం. ఎర్రబస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్‌ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఆదిలాబాద్‌కు నీళ్ల కోసం ప్రాణిహిత​- చేవెళ్ల ప్రాజెక్టు పనులను వైఎస్‌ ప్రారంభించారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి  చేసే  బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

‘‘జిల్లా అభివృద్ధికి రెండు నెలల్లో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. మళ్లీ తొందరలోనే ఆదిలాబాద్‌ వచ్చి సమీక్ష చేస్తాను. ఇంద్రవెల్లిలో యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా?. మేం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కాళేశ్వరం.. కూలేశ్వరం అయింది. ప్రజల సొమ్ము తిన్నవారు బాగుపడరు’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)