Breaking News

కేసీఆర్‌ సిట్‌ విచారణ.. రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Published on Mon, 02/02/2026 - 19:10

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిట్‌ నోటీసులు, విచారణపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉద్యమకారుడిని అవమానిస్తారా? అని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యమకారులు అనే పదాలు వారే రాసుకుంటున్నారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం. కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమకారుడు కాదా?. ఉద్యమాలు నడపలేదా?. ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేశారు?. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా?. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.

రాష్ట్రంలో పదవులన్నీ తీసుకున్నారు. భూములు పంచుకున్నారు. కాంట్రాక్టులు పంచుకుని.. చేయాల్సిన తప్పులన్నీ చేశారు. తప్పు చేస్తే విచారణ తప్పదు.. విచారణ చేయొద్దని ఎక్కడా లేదు. ఇప్పుడు చేసిన తప్పులకే నోటీసులు ఇచ్చారు. శిబూ సోరేన్‌ విచారణ ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాల రాయాలని బీజేపీ SIRను తీసుకువచ్చింది. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని చెప్పుకొచ్చారు. 
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)