Breaking News

అలా చేయడం బీజేపీతో కలిసిన్నట్టు కాదు: ఒమర్‌ అబ్దుల్లా

Published on Fri, 01/17/2025 - 07:46

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో​ ఎవరు ఉన్నా తాము ఇలాగే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

సీఎం ఒమర్‌ అబ్దుల్లా కన్వాల్‌లో జాతీయ చానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమర్‌.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాను కలిశాను. నేను కేంద్రం తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నాను అని కాదు. బీజేపీ చేసే పనిని నేను అంగీకరిస్తున్నానని దీని అర్థం కాదు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో అనుకూలంగా ఉంటున్నాం. అంతమాత్రాన మేము బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు.

రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్రం అవసరం ఎంతో ముఖ్యం. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న లక్ష్యాలు. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని ప్రశ్నించారు. కేంద్ర ​ప్రభుత్వం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. గత సంవత్సరం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం, రెండుసార్లు అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్‌లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని కలిశారు. దీంతో, ఒమర్‌..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఒమర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)