Breaking News

ఆ మంత్రులిద్దరికీ చం‍ద్రబాబు వార్నింగ్‌?!

Published on Tue, 07/16/2024 - 15:28

అమరావతి, సాక్షి: సచివాలయంలో ఇవాళ కేబినెట్‌ భేటీ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ‘నెల్లూరు పంచాయితీ’ జరిగింది. ఆ జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలపై ఆయన క్లాస్‌ తీసుకున్నారు.

నెల్లూరు మంత్రులిద్దరూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యవహారాల్లో పూర్తిగా ఆయన్ని పక్కన పెడుతూ వస్తున్నారు. తాజాగా మంత్రి ఆనం నిర్వహించిన సమీక్షకు ఆయన్ని పిలవలేదు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన బీద రవిచంద్ర.. అధినేత చంద్రబాబుని కలిసి ఆ ఇద్దరు మంత్రులపై ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆనం తన కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాలు చూపిస్తుండడంపైనా గరం అయ్యారని, ఇక నుంచైనా బీద రవిచంద్రతో కలిసి పని చేయాలని మంత్రులిద్దరికీ చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు సమాచారం.

ఇంకా భేటీలో మంత్రులతో చంద్రబాబు ఏమన్నారంటే.. 
నెల రోజుల పని తీరుపై చర్చ జరిపాం. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలి. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందే. అధికారాన్ని తలకెక్కించుకోవద్దు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలి అని సీఎం చంద్రబాబు సూచించారు.

చంద్రబాబు సీరియస్.. ఆ ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)