Breaking News

టీడీపీలో వివాదాల టెన్షన్‌.. చంద్రబాబు సైలెంట్‌?

Published on Sun, 11/09/2025 - 13:42

సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌కు టెన్షన్‌ పట్టుకుంది. ముఖ్యంగా టీడీపీలో నేతల వరుస వివాదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తలపట్టుకుంటున్న సమాచారం. మొన్న కొలికపూడి.. నిన్న సుధా మాధవి ఆరోపణలతో టీడీపీలో ఆందోళన మొదలైంది. నేతల ఆరోపణలపై టీడీపీ అధిష్టానం నోరు మెదపకపోవడం గమనార్హం.

అధికార టీడీపీలో సీటుకు కోట్లు ఆరోపణలు సంచలనంగా మారాయి. రైల్వే కోడూరు టికెట్‌ ఇప్పిస్తానని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేత వేమన సతీష్‌ తన వద్ద రూ.7 కోట్లు తీసుకున్నారని టీడీపీ కార్యకర్త సుధా మాధవి రోదించారు. ఆస్తులు, ఇల్లు అమ్ముకుని అప్పులు పాలై పోయామంటూ ఆవేదన చెందారు. సమస్య చెప్పుకునేందుకు కార్యాలయానికి వెళితే నంబర్‌లేని కారులో నా భర్తను, నన్ను తీసుకెళ్లిపోయారు. తనను కిడ్నాప్ చేశారని తెలిపారు. తమకు ప్రాణహని ఉందని కన్నీరు పెట్టుకున్నారు. కాగా, సుధా మాధవి ఆరోపణలపై టీడీపీ సైలంట్‌గా ఉంది.

మరోవైపు.. కేశినేని చిన్ని దందాల చిట్టాను టీడీపీ క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ ఇచ్చారు. ఎన్నికల్లో సీటు కోసం 5 కోట్లు ఇచ్చిన లెక్కలు వివరించారు. కేశినేని చిన్ని మంత్రి లోకేష్ పేరు చెప్పి చేస్తున్న పనులను కూడా వెల్లడించారు. తిరువూరులో గంజాయి, మద్యం, రేషన్, ఇసుక దందాలలో కేశినేని చిన్ని పాత్రపై ఆరోపణలు చేశారు. పార్టీ పదవులు కేశినేని చిన్ని అమ్ముకున్నారని కమిటీకి కొలికపూడి ఫిర్యాదు చేశారు. 

ఈ క్రమంలో కొలికపూడి ఆరోపణలపై కమిటీకి ఎంపీ కేశినేని చిన్ని వివరణ ఇచ్చారు. అనంతరం, కొలికపూడి కోవర్టు అంటూ చిన్ని ఆరోపించారు. ఈ ఎపిసోడ్‌లో రంగంలోకి దిగిన ఎల్లో మీడియా తన వంతుగా కొలికపూడిదే తప్పు అంటూ ఎంపీని రక్షించే ప్రయత్నం చేస్తోంది. కొలికపూడి ఎపిసోడ్‌ టీడీపీని టెన్షన్‌ పెడుతున్న సమయంలో సుధా మాధవి విషయం బయటకు రావడంతో పచ్చ పార్టీలో ఆందోళన మొదలైంది. అధికార కూటమి వరుస వివాదాలు బయటకు వస్తున్నప్పటికీ టీడీపీ, చంద్రబాబు మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)