Breaking News

సంక్షేమం, అభివృద్ధి ఆ తరువాతే..!: చంద్రబాబు

Published on Wed, 02/26/2025 - 04:19

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ముందుగా సంపద సృష్టించాలి.. ఆ తరువాతే ఆ ఆదాయాన్ని సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆలోచన, ఆశ ఉన్నాయి కానీ.. డబ్బుల్లేవ్‌..’ అని సీఎం చంద్రబాబు శాసనసభా వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని బయట­పడేస్తామని చెప్పారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు కావాలి. 

అందుకే కేంద్ర సహ­కారంతోపాటు అవసర­మైతే ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడతాం’ అని తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్య­వాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు శాసన­సభలో మంగళవారం మాట్లా­డారు. రాష్ట్ర పునర్ని­ర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42 వేల అమెరి­కన్‌ డాలర్లు సాధించాలన్నది తన లక్ష్యమన్నారు. 

అందుకే రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామన్నారు. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో డీఎస్సీ ద్వారా 16,354 టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. 

కేంద్ర ప్రభుత్వంతో కలసి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ మూడు వాయిదాల్లో రూ.20 వేలు ఇస్తామన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సబ్‌ కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. క్వారీ పనుల్లో 10 శాతం వడ్డెరలకు కేటాయిస్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నామన్నారు.  

రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు.  జూన్‌ 12 నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. ఉగాది రోజు పీ 4 కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న రూ. 6.50 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు.  

నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తామన్నారు. ఆ పరిమితి దాటితే ట్రస్టు ద్వారా వైద్య చికిత్స చేయిస్తామన్నారు. 2047 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ అనకాపల్లి వరకూ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. వంశధార ప్రాజెక్టు వరకు పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తామన్నారు.

దేశ రాజధానిని మార్చాలంటున్నారు..!
వాతావరణం, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీలో ఉండలేమని, రాజధానిని మార్చాలని చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. యమునా నది పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం మనం గర్వపడే రాజధానిగా ఢిల్లీని తయారు చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్‌ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే శాసన సభకు వస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)