Breaking News

సీఎం కుప్పం పర్యటన వేళ బది‘లీల’లు

Published on Mon, 06/24/2024 - 08:37

చిత్తూరు, సాక్షి: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండ్రోజులపాటు ఈ పర్యటన జరగనుంది. అయితే.. అంతకు ముందే అక్కడి అధికార యంత్రాంగాన్ని మార్చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

రేపు (మంగళవారం) సీఎం చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు. ఆ పర్యటనకు ఒకరోజు ముందు.. నియోజకవర్గానికి సంబంధించి పోలీసు అధికారులు ఆఘమేఘాల మీద బదిలీ అయ్యారు. కుప్పం సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలను వీఆర్‌కు పంపిస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు.

కుప్పం అర్బన్, రూరల్ సీఐలు రమణ, ఇశ్వర్‌రెడ్డిలను అనంతపురం వీఆర్‌కు బదిలీ చేశారు. అలాగే కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మికాంత్, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్లబుదుగురు ఎస్ఐ సుమన్‌ను చిత్తూరు వీఆర్‌కు బదిలీ  చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన టైంలో జరిగిన ఈ ఆకస్మిక బదిలీలు పోలీస్‌ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. కేవలం పోలీస్‌ శాఖనే కాదు.. మరికొన్ని విభాగాల్లోనూ ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, నేరుగా సీఎంవో నుంచే సంబంధిత శాఖలకు ఈ ఆదేశాలు అందుతున్నాయని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.  

.. ఇలాంటి బదిలీలు ఊహించినవే. కానీ, ఇప్పటికే వైఎస్సార్‌సీపీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ బదిలీల ద్వారా రాబోయే రోజుల్లో మరింత పేట్రేగిపోయే అవకాశం లేకపోలేదని మేధావులు విశ్లేషిస్తున్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)