Breaking News

ధర్మవరంలో ఉద్రిక్తత.. టీడీపీ-బీజేపీ నేతల మధ్య ఘర్షణ

Published on Sun, 01/26/2025 - 18:29

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు మైనార్టీ నేత జమీన్‌ సిద్ధమవ్వగా, జమీన్ చేరికను టీడీపీ ఇంఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మైనార్టీ నేత జమీన్ ఫ్లెక్సీలను పరిటాల శ్రీరామ్‌ వర్గీయులు చించివేశారు. ఈ క్రమంలో టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో రెండు స్కార్పియో వాహనాలు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

మరో వైపు, సామాన్యులపై కూడా టీడీపీ నేతల అనుచరులు రెచ్చిపోతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రధాన అనుచరుడు దాదు.. శివమాలధారణలో ఉన్న బలిజ శ్రీనివాసులు అనే ఆటోడ్రైవర్‌పై అకారణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాళ్లతో తన్నుతూ అవమానించాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం చోటు చేసుకుంది.

బాధి­తుడి కథనం మేరకు.. పెనుకొండ దర్గాపేటకు చెందిన దాదు కారులో వస్తూ స్థానిక దర్గా సర్కిల్‌లో అతని ఫ్లెక్సీకి ఎదురుగా శ్రీనివా­సులు ఆటో నిలిపి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆటో పక్కన పెట్టాలని హూంకరించాడు. ఆటో పక్కన పెడతా­నని అతను చెబుతుండగానే.. దాదు ఆగ్ర­హంతో ఊగి­పోతూ ‘లం.. కొడకా’ అని దూషిస్తూ చెప్పుల కాలితో తన్నుతూ దాడి చేశాడు. అక్కడున్న వారు సముదాయించినా అతను వినకుండా విచక్షణా­రహితంగా కొట్టాడు.

సమాచారం అందుకున్న బలిజ సంఘం, వీహెచ్‌పీ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వివాదం ముదరడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవన్‌.. వివిధ మండలాల ఎస్‌ఐలను రప్పించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, ఏఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ పెనుకొండ చేరుకున్నారు. వివాదాన్ని సద్దుమణచ­డానికి ప్రయత్నించినా ఆందోళనకారులు శాంతించలేదు. 

ఇదీ చదవండి: బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)