Breaking News

‘బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అదే మన ఆశ’

Published on Mon, 07/01/2024 - 08:38

పట్నా: దీర్ఘకాంలంగా ఉన్న బిహార్‌ ప్రత్యేక ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తానని కేంద్రమంతి చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో బిహార్‌ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు.

‘ఇది ఒత్తిడి చేసే రాజకీయం కాదు. ఇది మన దీర్ఘకాల డిమాండ్‌. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏ పార్టీ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని  డిమాండ్‌ చేయదు. ఏ పార్టీ అయినా బిహార్‌కు ప్రత్యేక హోదా అంగీకరిస్తుందా?. కానీ, మేము బిహార్‌కు  ప్రత్యేక హోదా విషయంలో అనుకూలంగా ఉన్నాం. మేము ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నాం. 

..ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీ. ప్రధాని మోదీ మా లీడర్‌. మేము ఆయనపై నమ్మకం పెట్టుకున్నాం.  ప్రధాని మోదీ ముందు ఈ డిమాండ్‌ను మేము పెట్టకపోతే.. మరి బిహార్‌కు​ ప్రత్యేకహోదా ఎవరు అడుగుతారు?. బిహార్‌ ప్రత్యేక హోదా  ఇవ్వాలి. అదే మన ఆశ. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే క్రమంలో మార్చాల్సిన కొన్ని నిబంధనలపై మేము చర్చిస్తాం’ అని అన్నారు.

అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేని కేంద్రం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బీహార్, ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఐదుస్థానాల్లో పోటీచేసీ ఐదింటిలో విజయం సాధించింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)