Breaking News

పూంఛ్‌ ఉగ్రదాడి.. బీజేపీ ఎ‍న్నికల స్టంట్‌: చన్నీ

Published on Sun, 05/05/2024 - 21:42

చండీగఢ్‌: జమ్ము-కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడి.. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న స్టంట్‌ అని పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌​జిత్‌ సింగ్‌ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలంధర్‌లో  నిర్వహించన ఎన్నికల ప్రచారంలో చన్నీ బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు.  

‘‘ఎన్నికల ముందు ఇవన్నీ బీజేపీ చేస్తున్న స్టంట్లు తప్ప ఉగ్రదాడులు కాదు. వాటిల్లో అసలు నిజమే లేదు. బీజేపీ ప్రజలు, శవాలతో ఆటలాడుతోంది. ఈ దాడులు నిజంగా జరిగినవి కావు. కేవలం బీజేపీకి ప్రయాజనం చేసేవి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గతంలో లాగా బీజేపీ ఇలాంటి చిల్లర స్టంట్లు చేస్తుంది’’ అని చన్నీ దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ  ఎన్నికల ముందు పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ సైనికులు మృతి  చెందిన విషయం తెలిసిందే.

అయితే చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర మంత్రి స్పందించారు. ‘‘చన్నీ ఉగ్రదాడిపై సైతం చాలా దిగజారిన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన మనస్తత్వానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు. శనివారం ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ వాహనంపై  జరిగిన ఉగ్రదాడిలో  ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన విక్కీ పహాడే సైనికుడు మరణించగా.. నాలుగురు సైనికులు గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల  25న జరగనున్న అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పూంఛ్‌ ఉంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)