Breaking News

సీఎం చేస్తే లక్ష్మీదేవమ్మ టికెట్‌ ఊడగొట్టారు

Published on Sun, 03/01/2026 - 10:19

అన్నమయ్య జిల్లా: అవసరానికి వాడుకొని, ఆపై నిర్దాక్షిణ్యంగా గెంటేసే చంద్రబాబును నిన్ను నమ్మం ‘బాబూ’ అంటున్నారు తంబళ్లపల్లె టీడీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిదాకా మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వద్దంటూ పక్కన పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు పారీ్టకి ఎవరూ దిక్కులేక మళ్లీ ఆయనకు వల వేయడంపై చర్చనీయాంశమైంది. రేపు మాపో తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జిగా శంకర్‌ పేరును ప్రకటించే అవకాశం ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తంబళ్లపల్లె టీడీపీ నేతలను చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో గుర్తు చేసుకుంటున్నారు. తాను సీఎం అయ్యేందుకు మద్దతిచ్చిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మకే  వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు శంకర్‌ విషయంలో చివరిదాకా అండగా నిలుస్తారా అని ప్రస్తావిస్తున్నారు. 

సీఎం చేస్తే లక్ష్మీదేవమ్మ టికెట్‌ ఊడగొట్టారు   
1994లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యేగా ఏవీ లక్ష్మీదేవమ్మ రెండోసారి గెలిచారు. ఈ ఎన్నికలో ఆ పార్టీ ఘనవిజయం సాధించడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 1995 ఆగస్టు సంక్షోభంలో లక్ష్మీదేవమ్మ ఎన్టీఆర్ ను  కాదని చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అందుకు చంద్రబాబు లక్ష్మీదేవమ్మకు ఇచ్చిన నజరానా రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడం. 1999, 2004 ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ ఇవ్వకుండా బీజేపీకి కేటాయించారు. 1999 ఎన్నికల్లో పొత్తు కారణంగా బీజేపీకి ఇచ్చినా  ఆమె సర్దుకు పోయారు. కానీ 2004లో మళ్లీ బీజేపికి టిక్కెట్‌ ఇవ్వడంతో ఆమెకు కుట్ర అర్థమైంది. దాంతో 2004 ఎన్నికల్లో ఆమె స్వతంత్రఅభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రాజకీయంగా ఆమెకు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.  

తల్లిని కాదని ప్రవీణ్‌కు..  
తనకు అండగా నిలిచిన లక్ష్మీదేవమ్మకు 2009లో టీడీపీ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వడానికి చంద్రబాబు ససేమిరా అన్నారు. తనయుడు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డికి టికెట్‌ ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. ఆ ఎన్నికల్లో లక్ష్మీదేవమ్మకు టికెట్‌ ఇచ్చి ఉంటే టీడీపీ రాజకీయాలు మరోలా ఉండేవి. అయితే రాజకీయాలంటే ఇష్టం లేని ప్రవీణ్‌ పోటీ చేయాలంటూ చంద్రబాబు తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఫలితంగా పోటీ చేసిన ప్రవీణ్‌ ఓటమి అంచులోకి వెళ్లి కేవలం రెండు వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం విషయంలో చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని జీర్ణించుకోలేని ప్రవీణ్‌ టీడీపీకి రాజీనామా చేశారు. ఇలా లక్ష్మీదేవమ్మ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు.  

ఒత్తిడి చేసి శంకర్‌ను రప్పించి..
2014 ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ అప్పటి సీఎం కిరణ్‌ తో తీవ్రంగా విభేదించారు. ఆయన తీరు నచ్చకపోవడంతో కాంగ్రెస్‌ రాజకీయాలకు దూరమై బెంగళూరుకు పరిమితమయ్యారు. అప్పట్లో టీడీపీకి ప్రవీణ్‌ రాజీనామా చేసి వెళ్లడంతో ఆ పారీ్టకి నాయకత్వం లేకపోయింది. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థి లేకపోతే పరువు పోతుందని శంకర్‌పై ఒత్తిడి తెచ్చి పోటీ చేయించారు. అయితే ఆయనపై చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణమైందనే చెప్పాలి. 

ముప్పుతిప్పలు పెట్టి..
2019 ఎన్నికల్లో శంకర్‌కు ఎవరూ పోటీ లేకపోయినా టికెట్‌ ఇచ్చే విషయంలో చంద్రబాబు చుక్కలు చూపించారు. వేరొకరికి టికెట్‌ ఇవ్వాలని ప్రయతి్నంచి చివరి నిమిషం దాకా టికెట్‌ ఖరారు చేయకుండా ముప్పు తిప్పులు పెట్టారు. టికెట్‌ ఇవ్వాలంటూ పార్టీ కార్యకర్తలు బస్సుల్లో వెళ్లి అమరావతిలో తిష్ట వేయాల్సి వచ్చింది. అయినా భరోసా ఇవ్వలేదు. తర్వాత టికెట్‌ ఇవ్వడం, ఓడిపోవడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయింది. కొత్త వ్యక్తి దొరకి ఉంటే చంద్రబాబు వెన్నుపోటుకు శంకర్‌ బలికావాల్సి వచ్చేది.  

2024లో తీరని పరాభవం
టీడీపీలో శంకర్‌ ఎదుర్కొన్న అవమానాలు, పరాభవాలు ఏ నేతకు ఎదురు కాలేదు. 2023లో లోకేష్‌ పాదయాత్ర కోసం శంకర్‌ ఆర్థికభారం మోయాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు కనీసం శంకర్‌ కు మాట మాత్రంగానైనా చెప్పకుండా,  బుజ్జగింపు మాటైనా లేక..  కొత్తగాపార్టీలో చేరిన జయచంద్రారెడ్డికి టికెట్‌ ప్రకటించారు. ఈ అవమానం తట్టుకోలేక శంకర్‌ పూర్తిగా బెంగళూరుకే పరిమితమయ్యారు. కొడుకు వివాహానికి ఆహ్వానించినప్పటికీ చంద్రబాబు హాజరు కాలేదు. ఈ పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారీ కేసులో ఇరుక్కుపోవడంతో ఇప్పుడు నాయకుడి అవసరం ఏర్పడింది.  

ఎవరూ లేకపోవడంతోనే..
స్థానిక ఎన్నికలు, బాధ్యతలు అప్పగించడానికి కొత్త నాయకుడు దొరకకపోవడంతో చంద్రబాబుకు శంకరే దిక్కయ్యాడు. నిన్నటిదాకా కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు ఆయనకే ఇంచార్జ్‌ బాధ్యతలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇంచార్జ్‌ పదవి ఇస్తే శంకర్‌ సామర్థ్యం చూసి ఇవ్వడం లేదని, చంద్రబాబు తెరవెనుక వేరే కుట్ర ఉండొచ్చని చర్చించుకుంటున్నారు.  లక్ష్మీదేవమ్మకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు శంకర్‌ విషయంలో అండగా ఉంటారా అన్న అనుమానాలను కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారు.  స్థానిక ఎన్నికల కోసం ఆర్థికంగా భరించే వ్యక్తి అవసరం ఉన్న కారణంగా శంకర్‌ను ఎంచుకొని ఉండవచ్చన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే పార్టీలో తనకు జరిగిన అవమానాలు, చంద్రబాబు తీరును మరిచిపోయి శంకర్‌ మళ్లీ టీడీపీ బాధ్యతలు తీసుకుంటారా అన్నది చర్చనీయాంశమైంది.  

చల్లపల్లెకు కూడా వెన్నుపోటే !
చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు బీజేపీ సీనియర్‌ నేత చల్లపల్లె నరసింహారెడ్డి కూడా బాధితుడే. 1999, 2004లో పొత్తులో తంబళ్లపల్లె నుంచి, 2914లో మదనపల్లె నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పొత్తు మాటేగాని చంద్రబాబు ఆయన గెలిపించేందుకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేయలేదు. కనీసం క్యాడర్‌ కు సూచనలైనా చేయలేదు. సభలు జరిగినప్పుడు గెలిపించాలని మాట తప్పితే..పార్టీ అంతర్గత సమావేశాల్లో గట్టి ఆదేశాలు ఇచ్చింది లేదు. బీజేపీ ఓట్లతో టీడీపీ లాభపడినప్పటికి చల్లపల్లెకు వరుస ఓటములు తప్పలేదు. ఓడిపోయిన మూడుసార్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఆయనకు కనీస అధికారం, గౌరవం దక్కలేదు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)