Breaking News

మాకేం సంబంధం లేదు.. అంతా కేంద్రమే: చంద్రబాబు

Published on Mon, 12/08/2025 - 18:20

సాక్షి, అమరావతి: ఇండిగో సమస్యను ఏపీ మంత్రి నారా లోకేష్‌ మానిటరింగ్‌ చేస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీ కొట్టుకున్న సెల్ఫ్‌ డబ్బా ఎంత ట్రోలింగ్‌కు దారి తీసిందో చెప్పనక్కర్లేదు. అసలు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు లోకేష్‌ ఎవరంటూ ఎవరు? అంటూ జాతీయ మీడియా చానెల్స్‌ ఏకిపారేశాయి. అదే టైంలో.. టీడీపీ నుంచి విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడిని సైతం రాజీనామా చేయాలంటూ బలమైన డిమాండే వినిపిస్తోంది. ఈ దరిమిలా ఇండిగో సమస్యను అవలీలగా కేంద్రంపైకి నెట్టేశారు చంద్రబాబు. 

మంచి జరిగితే క్రెడిట్‌ను నిసిగ్గుగా తన ఖాతాలో వేసుకునే నారా చంద్రబాబు నాయుడు.. ఇండిగో సమస్య విషయంలో మాత్రం యూటర్న్‌ తీసుకున్నారు. ఈ సంక్షోభాన్ని కేంద్రమే పరిష్కరించాలంటూ సోమవారం వ్యాఖ్యలు చేశారాయన. 

‘‘ఇండిగో ప్రమాణాలు పాటించడం లేదు. టైం ఇచ్చినా చేయలేకపోయారు. ఇండిగో గుత్తాధిపత్యం వల్లే సమస్యలు వచ్చాయి. ఈ విషయంపై మేమేం మానిటరింగ్‌ చేయడం లేదు. ఇండిగో సమస్యపై కేంద్రం దృష్టి పెట్టింది. వాళ్లే సమస్యకు కేంద్రమే పరిష్కారం కనిపెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. 

ఏపీలో ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. కానీ, సంక్షోభ బాధ్యతలను మాత్రం భాగస్వామిగా స్వీకరించడం లేదు. పైగా ఇండిగో సమస్యతో దేశం పరువు తీసిన రామ్మోహన్‌నాయుడుతో బాధ్యతగా మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిన పని కూడా చేయలేదు. ఇవేవీ చేయకపోగా.. ట్రోలింగ్‌ దెబ్బకు యూటర్న్‌ తీసుకుని ఇప్పుడు ‘‘అబ్బే.. ఇండిగో సమస్యతో మాకేం సంబంధం లేదని.. అంతా కేంద్రందే’’నంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)