Breaking News

అంబేద్కర్‌ విగ్రహం విధ్వంసం.. మౌనమెందుకు చంద్రబాబూ?

Published on Sat, 08/10/2024 - 10:21

సాక్షి, విజయవాడ: అంబేద్కర్‌ మహాశిల్పంపై దాడి ఘటనలో చంద్రబాబు సర్కార్‌ ఇప్పటికీ స్పందించలేదు. దాడిపై అంబేద్కర్‌ వాదులు మండిపడుతున్నారు. దాడి జరిగి రెండు రోజులవుతున్నా ఒక్కరినీ పోలీసులు అరెస్ట్‌ చేయలేదు. కనీసం కేసు నమోదు చేసి విచారిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించలేదు. అంబేద్కర్‌ మహాశిల్పంపై  సుత్తెలు, ఇనుప వస్తువులతో దాడి చేయగా, ఇంకా విచారణ చేయకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంబేద్కర్‌ అవమానించడంపై వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. నేడు ఏపీ వ్యాప్తంగా కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేయనుంది.

కాగా, ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పనేనని అంబేద్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. విగ్రహంపై దాడి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, దళిత సంఘం నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చేపట్టారు.

భావితరాలకు స్ఫూర్తిగా, దిక్సూచిగా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో అంబేద్కర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరం నడిబొడ్డులో అంబేడ్కర్‌ విగ్రహం ఉండకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఉద్దేశమని, ఈ నేపథ్యంలో విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నం చేసిందని పలువురు మండిపడుతున్నారు. 


 

 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)