టీడీపీలో ట్విస్ట్‌: అభ్యర్థులకు షాకిచ్చిన చంద్రబాబు

Published on Sat, 03/23/2024 - 13:56

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు షాకిచ్చారు. రానున్న 25 రోజుల్లో వారి పని తీరుపై సర్వేలు జరిపి అంచనా వేస్తానని బాబు చెప్పుకొచ్చారు. సర్వేల్లో అనుకూల ఫలితాలు రాకపోతే పార్టీ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తాయని.. పరోక్షంగా అభ్యర్థి మార్పు కూడా ఉండొచ్చని సంకేతాలిచ్చారు.

కాగా, టీడీపీ అభ్యర్థులకు నేడు విజయవాడలో వర్క్‌ షాప్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో సీటు రాని వారంతా కేవలం త్యాగం చేశారు అంతే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నాం. ఏకైక అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చింది. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు. జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారు. 

​రాష్ట్రంలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీలో 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం. అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది. సమర్ధులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు. డబ్బు సంపాదన ఒక్కటే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు. 

రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి. ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు.. వాళ్లు చేసిన త్యాగం ఎ‍ప్పటకీ ఉంటుంది. నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పని చేశారని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థులకు షాకిచ్చారు. టిక్కెట్ దక్కిందని సంబురపడకండి. రానున్న 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను.  సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం చోటుచేసుకుంది.  

మరోవైపు, జనసేన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి. ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం అని అన్నారు. దీంతో, నాందెడ్ల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)