Breaking News

ఆ 115 మంది ఆస్తుల లెక్కలు తీయండి

Published on Wed, 08/23/2023 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తీయాలని టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వివరాలను సేకరించి ప్రజల ముందుంచాలని చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ టూర్‌లో భాగంగా కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఆయన మంగళవారం ఈమేరకు స్పందించారు. 50 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని కేసీఆర్‌ ప్రశి్నస్తున్నారని, కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్‌ నుంచి అని గుర్తుచేశారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, శ్రీరాంసాగర్‌ లాంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సేనని, 50 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో పింఛన్లు ఒకటో తేదీకల్లా ఇచ్చామని, బీఆర్‌ఎస్‌ హయాంలో మాత్రం 15వ తేదీకి కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

విశ్వవిద్యాలయాల్లో కనీసం బాత్‌రూంలు కట్టించలేని ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని అని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టిన కేసీఆర్‌కు కాంగ్రెస్‌ గురించి ప్రశ్నించే హక్కు లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ హయాంలో 32 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తే కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం ఓట్ల కోసం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేస్తోందని చెప్పారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)