‘దుప్పటి.. చెట్టు.. ఆవు..’ లోకేష్‌, పవన్‌పై బైరెడ్డి చెప్పిన కథ

Published on Sat, 02/14/2026 - 16:27

సాక్షి, గుంటూరు: ఒక మనిషిని ఇబ్బంది పెడితే ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వం అని వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబుపై దాడి చేస్తే.. దాడికి గురైన బాధితుడే జైలులో ఉన్నారన్నారు. అంబటిపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలు స్టేషన్ బెయిల్ తీసుకుని బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని  బైరెడ్డి మండిపడ్డారు.

అంబటి రాంబాబు సాధారణమైన వ్యక్తి కాదు, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల కోసం పని చేశారు. హోం మంత్రి అర్ధ రహితంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబును ఏమి పీకలేరు. మన తప్పులు మనకి చిన్నవిగా ఎదుట వారికి పెద్దవిగా కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి నామరూపాలు లేకుండా పోతుంది. అంబటి రాంబాబును జైలులో పెడితే ఆయన కుమార్తె బయటకు వచ్చారు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.

జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్లు.. కుక్కలు కొట్టినట్టు కొట్టినాకూడా పవన్ కళ్యాణ్ స్పందించడు. పవన్‌కు ప్రతి నెలా ముట్టాల్సింది ముడుతుంది. కూలీ చేసేది జన సైనికులు.. లాభం అనుభవించేది టీడీపీ అంటూ.. జనసేన పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ.. బైరెడ్డి ఓ కథ చెప్పారు.

పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ ఇద్దరూ కూర్చొని ఉంటే.. చంద్రబాబు వచ్చి.. మూడు వస్తువులను పంచుకోమని చెప్పి.. దుప్పటి, చెట్టు, ఆవు వారికి ఇచ్చారు. లోకేష్‌ పవన్‌తో ఇలా అన్నాడంట.. నీకు పంపకాలు సరిగా రావు.. ఇద్దరికి న్యాయంగా పంచుతానన్నాడు. దుప్పటిని పగలు అంతా నువ్వు వాడుకో.. రాత్రి అయితే తానూ వాడుకుంటానంటూ చెప్పాడు. న్యాయంగా పంచావు తమ్ముడు అన్న పవన్‌ కల్యాణ్‌.. దుప్పటి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పగటి పూట ఎండ వేడికి ఆ దుప్పటిని కప్పుకోలేకపోయాడు. రాత్రికి లోకేష్‌కు ఇచ్చాడు.. చలికి ఆ దుప్పటిని బాగా కప్పుకుని పడుకున్నాడంట. దుప్పటి.. లోకేష్‌కు ఉపయోగపడింది. పవన్‌కు ఉపయోగపడలేదు.

తర్వాత ఇద్దరూ చెట్టు దగ్గరకు వెళ్లారు. ఇదీ కూడా న్యాయంగా పంచుతానన్న లోకేష్‌.. పై భాగం అంతా నేను తీసుకుంటా.. కింద భాగం అంతా నువ్వు తీసుకో అన్నాడంట.. అంటే చెట్టుకు నీళ్లు పోసేందంతా పవన్‌ కల్యాణ్‌.. కాసిన పండు తినేదంతా లోకేష్‌.. తర్వాత ఆవు దగ్గరకు వెళ్లారట. అన్నా.. ఇది కూడా న్యాయంగా పంచుతా.. ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో.. వెనుక భాగం అంతా నేను తీసుకుంటా.. ఆవుకు రోజూ.. మేత, నీళ్లు పోసేదంతా పవన్‌ కల్యాణ్‌.. వచ్చే పాలు పిండుకునేది లోకేష్‌.. ఇది జన సైనికులు పరిస్థితి ఎలా ఉందంటే.. కూలి చేసేది వీళ్లు.. వచ్చేదంతా తినేది తెలుగు తమ్ముళ్లు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వివరించారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)