Breaking News

KTR: రాజకీయ బేహారులకు జవాబు చెప్పేది వాళ్లే

Published on Fri, 03/29/2024 - 10:04

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందర.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కేకే, కడియం కుటుంబాలతో పాటు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇంకొంతమంది సైతం కాంగ్రెస్‌లో చేరవచ్చనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. ఈ తరుణంలో.. పార్టీ మారుతున్న నేతలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర  ట్వీట్ చేశారు. 

అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ ఒక్కడే ఒంటరిగా బయల్దేరి.. లక్షల మంది సైన్యంతో సాధించారని కేటీఆర్‌ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించారని తెలిపారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని కేటీఆర్‌ తన సందేశంలో పేర్కొన్నారు. 

ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కేటీఆర్‌ పార్టీ మారుతున్న నేతల ప్రభావం బీఆర్‌ఎస్‌పై ఉండబోదంటూ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: కారులో కలకలం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)