Breaking News

ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మళ్లీ నిన్న మాకు గుర్తొచ్చింది: కేటీఆర్‌

Published on Mon, 02/02/2026 - 13:12

హైదరాబాద్‌:  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిట్‌ విచారణ నిరసిస్తూ 7 వేల గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టారని, మమ్మల్ని తట్టిలేపిన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదు. మేడారం జాతర  ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది.మంత్రి వాహనంపై దాడి జరగడం, మొదటిసారి.  నిన్న కేసీఆర్‌ సిట్‌ విచారణకు రావాల్సిన అవసరం లేదు. 

చట్టం అంటే కేసీఆర్‌కు గౌరవం. అందుకే సిట్‌ విచారణకు హాజరయ్యారు. నిన్న మా ఇంటి చుట్టు వెయ్యి మంది పోలీసులను పెట్టారు. లా అండ్ ఆర్డర్ పై పోలీసులు దృష్టి పెడితే బావుంటుంది. సుల్తాన్ బజార్‌లో  పట్టపగలే ATM దగ్గర చోరి జరిగింది.నల్లమల సాగర్ తో నీళ్ల దోపిడి జరుగుతుంది

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి , సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళాడు. సింగరేణి కుంభకోణం బయట పెట్టాలి. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇచ్చారో వివరాలు బయట పెట్టాలి. సృజన్ రెడ్డి కాల్ డాటా బయట పెడితే అన్ని వాస్తవాలు తెలుస్తాయి.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు రౌడిలను వేసుకొని తిరుగుతున్నాడు.  కేసు పెట్టిన సీఐ హాబీబుల్లా ఖాన్‌ను అందుకే ట్రాన్సఫర్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదు. ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు. హరీష్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది

ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించాలి.సజ్జనార్ అయిన, ఇంకో అధికారి అయిన ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి కదా?, సజ్జనార్ జడ్జి కాదు , పోలీస్ అధికారి మాత్రమే. మరి ఈ మధ్య కాలంలో సజ్జనార్ జడ్జి అయ్యాడేమో నాకు అయితే తెలియదు. బిజెపి జాతీయ అధ్యక్షుడుకి పరిచయ కార్యక్రమం ఉంటే రాష్ట్రానికి రావొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఏ జిల్లా నాయకత్వం అక్కడ పనిచేస్తుంది. మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో... పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి’ అని విమర్శించారు.

ఇదీ చదవండి: 
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)