Breaking News

బై ఎలక్షన్లతో కాంగ్రెస్‌కు బైబై

Published on Mon, 08/25/2025 - 01:23

మియాపూర్‌: రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అవే బైబై ఎన్నికలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్‌ విసిరారు. మియాపూర్‌ నరేన్‌ గార్డెన్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపురం రాజు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.2.80 లక్షల కోట్ల అప్పుచేసి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లు గడవకముందే రూ.2.20 లక్షల కోట్ల అప్పుచేసి ఒక్క మంచిపని కూడా చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ను మహా నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. 

కరోనా సమయంలో ఏడాదిపాటు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగించామని తెలిపారు. ఇప్పుడు 20 నెలల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పుతో 42 ప్‌లైఓవర్లు, నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు, 36 మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించిందని వెల్లడించారు. రేవంత్‌ ప్రభుత్వం ఒక్క కొత్త వంతెన గానీ మోరీని గానీ నిర్మించిందా? అని ప్రశ్నించారు.  

హైడ్రా అరాచకంతో హైదరాబాద్‌ అతలాకుతలం 
కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన హైడ్రావల్ల హైదరాబాద్‌లో రి­య­­­ల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తిగా కుప్పకూలిందని కేటీఆర్‌ విమర్శించారు. హైడ్రా అరాచకాలతో నగరమంతా అతలాకుతలమైందని ఆరోపించారు. దుర్గంచెరువులో కాంగ్రెస్‌ హ­యాం­లో సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? అని సవాల్‌ చేశారు. 

పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా.. పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. 20 నెలల్లో హై­డ్రా పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అరాచకం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకపోతున్నారని, ఒకవేళ బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటే ఈ కార్యక్రమానికి ఎందుకు రాలే­దని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, సిం«ధూ ఆదర్శ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)