Breaking News

‘బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారు’

Published on Sat, 05/11/2024 - 16:20

సాక్షి, కరీంనగర్‌: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసే ఆలోచనలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో చంద్రబాబు గెలిస్తే.. బాబు, రేవంత్  కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

‘‘రేవంత్ రెడ్డి బీజేపీతో  పొత్తు పెట్టుకుని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతోంది. నేను గెలిస్తే వాటిని కొట్లాడి అడ్డుకుంటా. హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు రైలు రాబోతుంది.. అది నేను చేసిన పని.. గెలిస్తే వస్తుంది. తెలంగాణా నిధుల కోసం మోదీని నేను కలిసినన్ని సార్లు బండి సంజయ్ కలిశాడా?. కరీంనగర్ స్మార్ట్ సిటీకి వేయి కోట్లు తెచ్చిన. యువకుల్లరా మీకు ఉద్యోగాలు కావాలా.. విధ్వంసాలు కావాలా? అభివృద్ధి కోసం నా వెంట రండి.

ప్రజా స్పందన చూస్తే భారీ మెజరిటితో గెలువబోతున్నానన్న ధీమా కలుగుతోంది.పాంప్లెంట్లులో మోదీ బొమ్మ పెట్టకుండానే సంజయ్ ప్రచారం చేసిండు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రతి మంత్రిని కలిసినా  నేను. బండి సంజయ్ కరీంనగర్  అభివృద్ధి కోసం మోదీని ఏనాడూ కలువలేదు. కేబుల్ బ్రిడ్జిపైన నేడు చెత్త పేరుకు పోయింది.. అభివృద్ధి ఎటు పోతుంది? నా కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్న నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. కరీంనగర్‌ను వైబ్రెంట్ కరీంనగర్‌గా మార్చి చూపిస్తా’’ అని వినోద్‌ కుమార్‌ అన్నారు.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)