Breaking News

బీఆర్‌ఎస్‌కు విరాళాల వెల్లువ.. అగ్రస్థానంలో బీజేపీ

Published on Thu, 12/26/2024 - 16:02

ఢిల్లీ : గడిచిన ఎన్నికల్లో స్థానిక పార్టీల్లో బీఆర్‌ఎస్‌కు ఊహించని విధంగా విరాళాలు అందాయి. విరాళాలు పొందే విషయంలో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా..రెండో స్థానంలో కాంగ్రెస్‌ ఉంది.   

రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్‌సైట్‌లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? అందులో వివరించింది. 

ఈసీ నివేదిక ప్రకారం..  2023-24లో దాతలు బీజేపీకి రూ. 20,000 అంత కంటే ఎక్కువ మొత్తం దాదాపు రూ.2,244 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం 2022-23లో అందుకున్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. బీఆర్‌ఎస్‌ రూ.580 కోట్లతో రెండవ స్థానంలో, కాంగ్రెస్‌ రూ.289 కోట్లతో మూడో స్థానంలో ఉంది.  

కాంగ్రెస్‌కు అంతకుముందు సంవత్సరం రూ.20,000 అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో రూ.79.9 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం కాంగ్రెస్ కంటే బీజేపీకి అందిన విరాళాలు 776.82 శాతం ఎక్కువ.

ట్రస్ట్‌ (Satya Electoral Trust)లు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ అత్యధిక విరాళాలు అందించాయని భారత ఎన్నికల సంఘం (eci) డేటా చెబుతోంది. అందులో బీజేపీ రూ.723 కోట్లు, కాంగ్రెస్‌ రూ. 156 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ విరాళంగా వచ్చాయి. 

ఇతర పార్టీలలో, ఆమ్‌ ఆద్మీ 2023-24లో రూ. 11.1 కోట్ల విలువైన విరాళాలు పొందింది. అంతకు ముందు ఏడాది ఆప్ రూ.37.1 కోట్లు అందుకుంది. 2023-24లో సీపీఎం విరాళాలు రూ. 6.1 కోట్ల నుండి రూ. 7.6 కోట్లను పొందింది.   

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈసీ ఆయా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్ని వెల్లడించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)