Breaking News

ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ జాతీయస్థాయి పోరు

Published on Thu, 07/11/2024 - 04:46

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ బీ–ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్‌ఎస్‌ జాతీయస్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లనుంది. 

ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ ప్రయత్నాల్లో పురోగతితోపాటు, పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయపోరాటానికి సంబంధించిన అంశాలను ఇద్దరు నేతలు కేసీఆర్‌తో చర్చించినట్టు సమాచారం. 

ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. 
ఇప్పటివరకు ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, వారిపై అనర్హత వేటు వేయా లని అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసినా అనర్హత వేటు వేయకపోవడాన్ని బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం ప్రయత్నించాలని నిర్ణయించింది. గతంలో సుప్రీంకోర్టులో వివిధ పార్టీల తరపున ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం వాదించిన న్యాయవాదులతో ఢిల్లీలో సంప్రదింపులు జరిగినట్టు తెలిసింది. 

రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ అడగాలని.. 
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్‌గాంధీ మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కాంగ్రెస్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శిస్తున్న బీఆర్‌ఎస్‌ ఈ అంశాన్ని రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ అడగాలని బుధవారం కేసీఆర్‌తో జరిగిన భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)