Breaking News

ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తా: రేఖా నాయక్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 08/22/2023 - 10:31

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ నిరాకరించింది. అసిఫాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చింది. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేతలపై ఫోకస్‌ పెట్టింది. బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ రాని నేతలతో చర్చలు జరుపుతోంది.

సాయంత్రం కాంగ్రెస్‌లోకి?
ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్‌ రావడంతో ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. సాయంత్రం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఖానాపూర్‌ క్యాడర్‌ తనతోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు.  

త్వరలోనే నిర్ణయం
ఏదైనా అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని రేఖా నాయక్‌ పేర్కొన్నారు. ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పారు. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా ఇప్పటికే  రేఖా నాయక్‌ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్‌ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఆయన ఆసిఫాబాద్‌ స్థానం నుంచి రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలోనే రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్‌ సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

ఆయన కూడా అసంతృప్తితోనే
కాగా ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్‌ స్థానాలకు కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్‌ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్‌ నుంచి గెలిచి వెంటనే బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలావుండగా బోథ్‌ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కలేదు.
చదవండి: కేసీఆర్‌ వ్యూహం.. ఇది ప్రత్యర్దులకు రాజకీయ సవాల్

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)