Breaking News

బండి సంజయ్ సీఎం రేవంత్‌కు కోవర్టు: కేపీ వివేకానంద

Published on Sun, 08/11/2024 - 17:09

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  కేపీ వివేకానంద మండిపడ్డారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీజేపీ నాయకులు అసలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదు.. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారాడు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవర్టుగా మారారు. 

కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీ వేదికగా బయటపడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలని పొగుడుతూ మాట్లాడాడు. ఢిల్లీలో కుస్తీ గల్లిలో దోస్తీ కాంగ్రెస్‌, బీజేపీ పని. ఈ రెండు పార్టీలకు చెరో 8 పార్లమెంట్ స్థానాలను ప్రజలు ఇచ్చారు.. ఇస్తే రాష్ట్రానికి ఏం తెచ్చారు?. కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలని అంటున్నారు బండి సంజయ్. ఎందుకు కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలి?. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసిఆర్ అరెస్ట్ చేయాలా?. ఈ  నెల రెండో తేదీన సుంకిశాల ప్రమాదం జరిగింది. సుంకిశాల ప్రమాదం చిన్నదిగా చూపుతోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఎందుకు ఆ కాంట్రాక్టు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం లేదు ప్రభుత్వం’అని అన్నారు.

బండి సంజయ్‌ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘సీఎం రేవంత్‌ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కేటీఆర్‌ను కచ్చితంగా జైలులో వేస్తారు. ఒకవేళ కేటీఆర్‌ను జైల్లో పెట్టకపోతే బీజేపీ నుంచి పెద్ద యుద్ధమే ఉంటుంది. బీఆర్‌ఎస్‌ పాలనను మా కేడర్‌ మరిచిపోదు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అనే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీ కేడర్‌కు ఉంది’ అని అన్నారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు