Breaking News

రైతులకు సంచులిచ్చే తెలివి లేదా?.. కాంగ్రెస్‌పై హరీష్‌ రావు ఫైర్‌

Published on Sun, 11/03/2024 - 15:25

సాక్షి, సిద్దిపేట: రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌ రైతులను నట్టేట ముంచారు. రాష్ట్రంలో రైతుల వడ్లు కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, రైతులకు బోనస్‌ ఇవ్వరు.. రైతుబంధు ఇవ్వరు అని ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస​్‌ నేతలకు పని తక్కువ.. కోతలు ఎక్కువ. రైతులకు సంచులు పంపే తెలివి లేదా?. హైదరాబాద్‌లో కూర్చోవడం కాదు. రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసింది. సీఎం రేవంత్‌ ఒక్కసారైనా ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా?. రైతులను నట్టేట ముంచిన వ్యక్తి రేవంత్‌ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు లేదు.. వడ్లకు బోనస్‌ లేదు. తెలంగాణలో వడ్లు కొనే దిక్కు లేదు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవాలి. 30 శాతం వడ్లు దళారులు కొన్నారు. ఎలక్షన్ కన్నా ముందు రైతు ఓట్లు అన్ని నాకే కావాలన్నారు. నెల రోజులైనా సంచులు ఇవ్వలేదు. చాలా జిల్లాలో రైతులు ధర్నాలు చేస్తున్నారు.

రుణ మాఫీకి 31 రకాల కోతలు పెట్టిన వ్యక్తి రేవంత్‌. లక్షా 50వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారు కానీ.. రైతులకు బోనస్‌ ఇవ్వరు. అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల వడ్లు తడిసిపోయాయి. తడిచిన వడ్లు మీరు కొనరు. కలెకర్లు అక్కడికి రారు.. మీ మంత్రులు అటువైపు కూడా చూడరు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే రివ్యూ చేయాలి. రైస్ మిల్లరతో చర్చలు చేయాలి. రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)